PM Modi: ఇబ్బంది కలిగిస్తున్నందుకు క్షమించండి.. ఢిల్లీ వాసులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి!

PM Modi Apologies To Delhi People Of For Inconvenience

  • జీ20 సదస్సు కోసం ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు
  • పలు రూట్లలో వాహనాల దారిమళ్లింపు
  • అసౌకర్యం కలుగుతుందంటూ ముందే క్షమాపణ అడిగిన ప్రధాని

జీ20 దేశాల సదస్సు సందర్భంగా వచ్చే నెలలో ఢిల్లీ ప్రజలకు అసౌకర్యం కలగవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దేశవిదేశాల నుంచి అతిథుల కోసం ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించాల్సి వస్తుందని, దీనివల్ల ఇబ్బంది తప్పదని అన్నారు. అందుకే ముందుగానే ఢిల్లీ వాసులను క్షమాపణ కోరుతున్నానని ఆయన వివరించారు. ఈమేరకు బెంగళూరు నుంచి ఢిల్లీకి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్ పోర్ట్ లో మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు.

సెప్టెంబర్ 7, 8, 9 తేదీలలో ఢిల్లీలో జీ20 సమిట్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రపంచ నేతలు ఢిల్లీకి వస్తారని చెప్పారు. దేశంలోని వివిధ నగరాలలో జీ20 సమిట్ కార్యక్రమాలు జరిగాయని, వచ్చే నెలలో ఢిల్లీలో జరగబోయే కార్యక్రమాలతో సదస్సు ముగుస్తుందని మోదీ వివరించారు. ఈ సదస్సును విజయవంతం చేయాలంటూ ఢిల్లీ ప్రజలకు ఈ సందర్భంగా ప్రధాని పిలుపునిచ్చారు. ప్రపంచ నేతలకు ఆతిథ్యం ఇచ్చే క్రమంలో దేశ ప్రతిష్ఠపై ప్రభావం పడకుండా చూసుకోవాలని కోరారు.

PM Modi
Delhi People
apology
G20 summit
  • Loading...

More Telugu News