Ram: 'నా లక్కూ మీరే .. నా కిక్కూ మీరే: 'స్కంద' ఈవెంటులో రామ్

Skanda movie pre release event

  • సెప్టెంబర్ 15న 'స్కంద' సినిమా రిలీజ్ 
  • హైదరాబాదులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • బాలయ్య ప్రత్యేకతను గురించి ప్రస్తావించిన రామ్ 
  • తాను ఏం చేసిన ఫ్యాన్స్ కోసమేనని వెల్లడి


ఈ మధ్య కాలంలో రామ్ మాస్ యాక్షన్ సినిమాలను ఎక్కువగా చేసుకుంటూ వెళుతున్నాడు. అదే జోనర్లో ఆయన బోయపాటితో కలిసి చేసిన సినిమానే 'స్కంద'. సెప్టెంబర్ 15వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. బాలయ్య చీఫ్ గెస్టుగా పాల్గొన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో రామ్ మాట్లాడుతూ, "మూడు తరాల ప్రేక్షకులను మెప్పించడం బాలయ్యకే సాధ్యం అయింది" అంటూ అభిమానులను హుషారెత్తించాడు. 

"బోయపాటి గారు ఒక విషయాన్ని  నమ్మారు అంటే, ఇక ఆయన మొండిగా ముందుకు వెళ్లిపోతారు. ఆయనలో నాకు నచ్చినది అదే. తనకి కావలసిన అవుట్ పుట్ వచ్చేవరకూ అక్కడే నిలబడతారు. ఇక శ్రీలీల విషయానికి వస్తే, తాను మంచి డాన్సర్. తనకి మంచి ఫ్యూచర్ ఉందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు" అన్నాడు. 

"ఇక నేను యాక్షన్ కి రెడీ అయితే నా ముందు కెమెరా కనిపించదు .. నా అభిమానులే కనిపిస్తారు. నా లక్కూ వాళ్లే .. నా కిక్కూ వాళ్లే. అలా వాళ్లను దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమానే ఇది. వాళ్లకి కావలసిన అవుట్ పుట్ ను అందించడం కోసమే సెట్లో నేను సైలెంట్ గా ఉంటాను. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు. 

Ram
Sreeleela
Boyapati Sreenu
Skanda Movie
  • Loading...

More Telugu News