Ram: సౌండ్ గోల్కొండ దాటాలా .. శాల్తీ శాలిబండ చేరాలా : 'స్కంద' ట్రైలర్ డైలాగ్

Skanda movie trailer released

  • రామ్ హీరోగా రూపొందిన 'స్కంద'
  • యాక్షన్ .. ఎమోషన్స్ ప్రధానంగా సాగే కథ 
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచే తమన్ సంగీతం
  • సెప్టెంబర్ 15వ తేదీన సినిమా విడుదల    

రామ్ - బోయపాటి దర్శకత్వంలో 'స్కంద' సినిమా రూపొందింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, సెప్టెంబర్ 15వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ ముఖ్య అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదు - శిల్పకళావేదికలో నిర్వహించారు. 

ఈ వేదిక ద్వారా .. బాలకృష్ణ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 'ఇయ్యాలే .. పొయ్యాలే .. గట్టిగా అరిస్తే తొయ్యాలే .. అడ్డమొస్తే లేపాలే' .. 'దెబ్బ తాకితే సౌండ్ గోల్కొండ దాటాలా .. శాల్తీ శాలిబండ చేరాలా' .. వంటి రామ్ పవర్ఫుల్ డైలాగ్స్ పై, భారీ యాక్షన్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. 

యాక్షన్ మాత్రమే కాదు .. ఎమోషన్స్ కి కూడా ప్రాధాన్యతనిస్తూ ట్రైలర్ లో వాటిని టచ్ చేశారు. శ్రీలీల కథానాయికగా కనిపించనున్న ఈ  సినిమాలో, శ్రీకాంత్ .. ఇంద్రజ .. గౌతమి .. దగ్గుబాటి రాజా ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. థమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయనున్నారు.

Ram
Sreeleela
Boyapati Sreenu
Skanda Movie

More Telugu News