Sri Lanka: సోదరి పెళ్లిలో భోరున విలపించిన శ్రీలంక క్రికెటర్!

Hasaranga Shares Emotional Moment With Sister at Her Wedding
  • సోదరిని గట్టిగా హత్తుకొని భావోద్వేగానికి గురైన హసరంగ
  • చెల్లితో అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఏడ్చేసిన క్రికెటర్
  • సోదరి వివాహంలో ప్రతి సోదరుడు భావోద్వేగానికి గురవుతారంటూ నెటిజన్ల స్పందన
శ్రీలంక ఆల్ రౌండర్ వనిందు హసరంగ తన సోదరి పెళ్లిలో భావోద్వేగానికి గురయ్యాడు. తన సోదరి చతు డిసిల్వా పెళ్లిలో కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వెలుగు చూసింది. అందరినీ కదిలించే ఈ వీడియోను ఓ అభిమాని ఎక్స్ (ట్విట్టర్) వేదికలో పోస్ట్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ అయింది.

ఈ వీడియోలో ఉన్న దాని ప్రకారం హసరంగా తన సోదరిని ప్రేమతో గట్టిగా హత్తుకున్నాడు. సోదరి అప్పగింతల సమయంలో అనుబంధాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అతని కంట కన్నీళ్లు వచ్చాయి. దీంతో చెల్లెలు కూడా భోరున విలపించింది. దీనిని చూసిన పెళ్లికి వచ్చిన కొంతమంది అతిథులు వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. హసరంగా కళ్లు తుడుచుకునే ప్రయత్నం చేస్తూనే.. మా చెల్లిని బాగా చూసుకోవాలని చెబుతూ బావను పట్టుకుని కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. నెటిజన్లు కూడా రెడ్ హార్ట్ ఎమోజీలతో స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ అయితే ప్రతి సోదరుడు కూడా తమ సోదరి వివాహంలో భావోద్వేగానికి గురవుతాడని పేర్కొన్నాడు. కాగా, హసరంగ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
Sri Lanka
Hasaranga
Cricket
marriage

More Telugu News