Pawan Kalyan: అర్జున్ దాస్​ వాయిస్​ ఓవర్‌‌.. 72 సెకన్ల నిడివితో రెడీ అవుతున్న ‘ఓజీ’ టీజర్​

OG glimpse  Duration 72 secs with Arjun Das Voice Over

  • పవన్‌ పుట్టిన రోజు కానుకగా సెప్టెంబర్2న విడుదల కానున్న టీజర్!
  • సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా
  • హీరోయిన్‌గా ప్రియాంక మోహన్

బ్రో సినిమాతో తన అభిమానులను అలరించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ‘ఓజీ’ సినిమాతో ముందుకు రాబోతున్నారు. రన్ రజా రన్, సాహో చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రీ లుక్‌ పోస్టర్‌తోనే భారీ అంచనాలు క్రియేట్ చేశాడు. సాహో తర్వాత ఐదేళ్లు విరామం తీసుకున్న సుజీత్‌ ఇప్పుడు పవన్ చిత్రంతో తన సత్తా చూపెట్టుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. గ్యాంగ్ స్టర్ గా పవన్‌ని ఓ రేంజ్‌లో చూపెట్టబోతున్నాడని తెలుస్తోంది. 

ముఖ్యంగా ఫైట్స్‌ అయితే పవన్ కెరీర్‌‌లోనే బెస్ట్ అనేలా ఉంటాయని టాలీవుడ్‌ టాక్. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే కానుకగా సినిమా టీజర్ ను విడుదల చేయాలని సుజీత్ ప్లాన్ చేస్తున్నాడు. సినిమా రేంజ్ ను చూపేలా 72 సెకన్లతో టీజర్ కట్ చేసినట్టు టాక్. ఈ సినిమాలో తమిళ నటుడు అర్జున్‌ దాస్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు. అతని వాయిస్ ఓవర్ తో సినిమా టీజర్ లో పవన్ విశ్వరూపాన్ని చూపెట్టనున్నాడు సుజీత్. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్‌ సరసన ప్రియాంక మోహన్‌ నటిస్తోంది.

Pawan Kalyan
OG
sujeet
Arjun das
teaser
  • Loading...

More Telugu News