massive blender: టీవీని సైతం పిండిని చేసే బాహుబలి మిక్సర్ గ్రైండర్.. వీడియో!

Trio blitz a TV in a massive blender vedio viral

  • ముగ్గురు వ్యక్తుల తయారీ
  • మిక్సర్ జార్ లో టెలివిజన్ పెట్టి స్విచ్ ఆన్
  • ముక్కలుగా చేసేసిన జార్

మన ఇళ్లల్లో మిక్సర్ గ్రైండర్ల పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. వాటికి భిన్నంగా 15-20 అడుగుల పొడవైన, ఐదారు అడుగుల వెడల్పుతో కూడిన బాహుబలి మిక్సర్ గ్రైండర్ ను ఎప్పుడైనా చూశారా..? చూడకపోతే ఈ వీడియో క్లిక్ చేస్తే సరి. ఈ మిక్సర్ గ్రైండర్ టెలివిజన్ సెట్ ను సైతం పిండిగా మార్చేసి పెడుతుంది. ఇందుకు సంబంధించిన వీడియోని ‘హౌ రిడిక్యులస్’ అనే ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో షేర్ చేయగా.. ఇప్పుడది వైరల్ అవుతోంది.

మిక్సర్ జార్ పారదర్శకంగా ఉండి, అందులోని బ్లేడ్ కూడా బయటకు కనిపిస్తోంది. ముగ్గురు వ్యక్తులు దీన్ని తయారు చేశారు. జార్ పై నుంచి టీవీని తాడుతో వేలాడదీసి ఉంచారు. 20 అడుగుల దూరంలో ఆన్, ఆఫ్ బటన్ ని ఏర్పాటు చేశారు. వీటి గురించి వివరించిన తర్వాత ఓ వ్యక్తి వెళ్లి మిక్సర్ ను ఆన్ చేయడం ఆలస్యం.. అందులోని టీవీ కింద పడి ముక్కలు కావడాన్ని చూడొచ్చు. ఈ వీడియోకి ఇప్పటికే 4 లక్షల వ్యూస్ వచ్చేశాయి. వీడియో చూసిన వారు స్పందించకుండా ఉండలేకపోతున్నారు. తమకు నచ్చిన రీతిలో, నవ్వు తెప్పించే విధంగా కామెంట్లు పెడుతున్నారు.  (వీడియో కోసం)

More Telugu News