papaya seeds: బొప్పాయి గింజలు పడేస్తున్నారా..? ఆ పని చేయొద్దు..!

more health benefits with papaya seeds

  • పేగుల్లో చెడు బ్యాక్టీరియాకు చెక్
  • చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం వల్ల గుండెకు రక్షణ
  • మహిళల్లో నెలసరి క్రమబద్ధీకరణకు సాయం
  • పీచు తగినంత ఉండడంతో బరువు తగ్గేందుకు మార్గం

బొప్పాయి పండును చాలా మంది ఇష్టంగా తింటుంటారు. పండును కోసినప్పుడు పొట్టలో కనిపించే నల్లటి గింజలను తీసి పడేస్తుంటారు. కానీ, ఆ పని అస్సలు చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే తినడానికి రుచిగా ఉండకపోవచ్చు కానీ, ఈ గింజల్లో ఎన్నో ఆరోగ్య సుగుణాలు ఉన్నాయి. మంచి ఔషధాన్ని చెత్తబుట్ట పాలు చేసుకున్నట్టు అవుతుంది. 

  • బొప్పాయి గింజల్లో మంచి ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా తగినంత లభిస్తాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో అవసరం. 
  • బొప్పాయి గింజల్లో కార్పెయిన్ ఉంటుంది. ఇది పేగుల్లోని చెడు బ్యాక్టీరియాని, కడుపులో పురుగులను చంపేస్తుంది. దీంతో మలబద్ధకం పోయి, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది.
  • బరువు తగ్గాలని అనుకునే వారికి బొప్పాయి గింజలు మంచి ఔషధం. ఇందులో పీచు ఉంటుంది. శరీరంలో అదనపు కొవ్వుల నిల్వలను ఇది నిరోధిస్తుంది. దీంతో బరువు పెరిగే సమస్య ఉండదు. జీవక్రియలు చురుగ్గా మారేందుకు కూడా బొప్పాయి గింజలు అవసరం.
  • బొప్పాయి గింజల్లో ఉండే ఒలియిక్ యాసిడ్ చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. దీంతో మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండెకు రక్షణ ఏర్పడుతుంది.
  • ఆల్కలాయిడ్స్, పాలీఫెనాల్స్, ఫ్లావనాయిడ్స్ వంటివి శరీరంలో ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలను తగ్గిస్తాయి. దీంతో ఆర్థరైటిస్, గౌట్, కేన్సర్ నుంచి రక్షణ ఏర్పడుతుంది.
  • మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పి నుంచి బొప్పాయి గింజలు ఊపశమనాన్ని ఇస్తాయి. సాధారణంగా నెలసరి సరిగ్గా లేని వారు రోజూ బొప్పాయి గింజలు తినడం మంచిది. ఇది నెలసరిని క్రమబద్ధీకరిస్తుంది. ఆ సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

  • Loading...

More Telugu News