Allu Arjun: జాతీయ అవార్డు వచ్చాక తొలిసారి చిరును కలవనున్న బన్నీ!

Allu Arjun to meet chiranjeevi today

  • జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న 
    అల్లు అర్జున్
  • పుష్ప సినిమాలో నటనకు వరించిన పురస్కారం
  • ఢిల్లీలో శస్త్ర చికిత్స చేయించుకొని హైదరాబాద్ 
    చేరుకున్న చిరు

జాతీయ సినిమా పురస్కారాల్లో టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ అవార్డుకు ఎంపికైన మొదటి నటుడిగా చరిత్ర సృష్టించాడు. 'పుష్ప' సినిమాలో నటనకి గాను ఈ అవార్డు లభించింది. దాంతో ప్రపంచం నలుమూలల నుంచి బన్నీకి శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. బన్నీ సైతం కొందరి ఇంటికి స్వయంగా వెళ్తున్నాడు. నిన్న బ్రహ్మానందం ఇంటికి వెళ్లాడు. బన్నీకి బ్రహ్మానందం పెద్ద పూలమాల వేసి, అభినందించారు. ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లనున్నాడు.

వాస్తవానికి అవార్డు వరించిన వెంటనే బన్నీ.. మెగాస్టార్ ఆశీర్వాదం తీసుకుంటారని అనుకున్నారు. కానీ, ఇప్పటిదాకా చిరును బన్నీ కలవకపోడం చర్చనీయాంశమైంది. దీనికి బలమైన కారణమే ఉంది. చిరంజీవి ప్రస్తుతం హైదరాబాద్‌లో లేరు. తన కాలుకు శస్త్రచికిత్స కోసం ఢిల్లీ వెళ్లారు. శస్త్ర చికిత్స చేయించుకుని ఈరోజు ఉదయమే హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో చిరు ఇంటికి వెళ్లి ముందుగా ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేసిన తర్వాత ఆయన ఆశీర్వాదం తీసుకుంటాడని తెలుస్తోంది.

Allu Arjun
Chiranjeevi
Tollywood
national award
  • Loading...

More Telugu News