Balakrishna: అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడంపై స్పందించిన బాలకృష్ణ

Balakrishna reacts on Allu Arjun getting National Award

  • అల్లు అర్జున్‌కు అవార్డు వచ్చినందుకు నటుడిగా గర్వపడుతున్నానన్న బాలకృష్ణ
  • తెలుగు సినిమా దేశ విదేశాల్లో సత్తా చాటడం సంతోషకరమని వ్యాఖ్య
  • ఆర్ఆర్ఆర్, ఉప్పెన చిత్ర బృందాలకు శుభాకాంక్షలు తెలియజేసిన బాలయ్య

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడంపై యువరత్న నందమూరి బాలకృష్ణ స్పందించారు. అల్లు అర్జున్‌కు అవార్డు వచ్చినందుకు ఎంతో గర్వపడుతున్నట్లు చెప్పారు. తెలుగు సినిమా దేశ విదేశాల్లో సత్తా చాటడం సంతోషకరమని తెలిపారు. విదేశీయులు కూడా తెలుగు సినిమా చూసే స్థాయికి రావడం హర్షణీయమని అన్నారు. 

‘‘సోదరుడు అల్లు అర్జున్‌కు ఉత్తమ జాతీయ నటుడి అవార్డు రావడం అనేది.. ఓ నటుడిగా నాకు చాలా గర్వంగా ఉంది. మా నటులందరికీ అదొక గర్వకారణం. ఆర్ఆర్ఆర్ సినిమాకు 6 అవార్డులు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌‌ అవార్డు సాధించింది. ఉప్పెన చిత్రానికీ జాతీయ అవార్డు వచ్చింది. అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా” అని చెప్పారు.

Balakrishna
Allu Arjun
National Award
Pushpa
RRR
uppena
Tollywood

More Telugu News