Lakshmi Parvati: అతిథుల జాబితాలో తన పేరును కూడా చేర్చాలని రాష్ట్రపతికి లక్ష్మీపార్వతి లేఖ

Laxmi Parvathi letter to President

  • ఈ నెల 28న ఎన్టీఆర్ రూ.100 నాణెం రాష్ట్రపతి చేతుల మీదుగా విడుదల
  • చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులకు ఆహ్వానం
  • తనకు ఆహ్వానం లేకపోవడంతో లేఖ రాసిన లక్ష్మీపార్వతి

దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జ్ఞాపకార్థం ఈ నెల 28న రూ.100 నాణేన్ని ఆవిష్కరించనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ చిత్రంతో నాణేన్ని తీసుకు వస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దీనిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

ఇక, ఎన్టీఆర్ చిత్రంతో కూడిన రూ.100 నాణెం విడుదల కార్యక్రమానికి అతిథులు జాబితాలో లక్ష్మీపార్వతి పేరు లేదు. దీంతో ఆమె రాష్ట్రపతికి లేఖ రాశారు. అతిథుల జాబితాలో తన పేరును చేర్చాలని కోరారు. కేవలం చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులను పిలవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎన్టీఆర్ భార్యనని లేఖలో పేర్కొన్నారు. 1994 ఎన్నికల్లో తాను ఎన్టీఆర్‌తో ఉన్నట్లు చెప్పారు. ఎన్టీఆర్‌తో వివాహం, ఎన్నికల్లో గెలుపు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు తదితర అంశాలతో ఆమె ఈ లేఖ రాశారు.

Lakshmi Parvati
ntr
President Of India
  • Loading...

More Telugu News