Chiranjeevi: నిన్ను చూసి గర్వపడుతున్నాం!: బన్నీకి చిరంజీవి అభినందనలు

Chiranjeevi Congratulates Allu Arjun

  • అవార్డులు దక్కించుకున్న వారందరికీ చిరు శుభాకాంక్షలు
  • బన్నీకి ప్రత్యేక అభినందనలు తెలిపిన మెగాస్టార్
  • ఆర్ఆర్ఆర్, పుష్ప, ఉప్పెన, కొండపొలం సినిమా బృందాలకు అభినందనలు

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు జాతీయ ఉత్తమ అవార్డు రావడంపై మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. 2021వ సంవత్సరానికి గాను 69వ జాతీయ సినిమా అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు పరిశ్రమకు పది అవార్డులు వచ్చాయి. అల్లు అర్జున్‌ను చూసి గర్విస్తున్నామని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

69వ జాతీయ సినిమా అవార్డులు దక్కించుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, తెలుగు సినిమాలకు పలు అవార్డులు రావడం గర్వకారణమన్నారు. బన్నీకి ప్రత్యేకంగా హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. నిన్ను చూసి గర్వపడుతున్నామని పేర్కొన్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆరు అవార్డులు, పుష్ప సినిమాకు రెండు అవార్డులు వచ్చాయని, అలాగే కొండపొలం సినిమాకు ఒక అవార్డు, ప్రాంతీయ ఉత్తమ భాషా చిత్రంగా నిలిచిన ఉప్పెనకు, బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ పురుషోత్తమాచార్యులు... అవార్డు గెలుచుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.

Chiranjeevi
Allu Arjun
Jr NTR
  • Loading...

More Telugu News