Baby: వైష్ణవి కాళ్లు పట్టుకునైనా ఒప్పించాలనుకున్నాను: 'బేబి' డైరెక్టర్ సాయిరాజేశ్

Sai Rajesh Interview

  • తనపై విజయ్ దేవరకొండకి నమ్మకం ఉందన్న సాయిరాజేశ్ 
  • ఆయన వల్లనే ఆనంద్ దేవరకొండ వేరే ఆలోచన చేయలేదని వెల్లడి 
  • బోల్డ్ సీన్స్ కారణంగా కొంతమంది హీరోయిన్స్ ఒప్పుకోలేదని వ్యాఖ్య 
  • వైష్ణవిని ఒప్పించడం కష్టమైందంటూ వివరణ

'బేబి' సినిమాతో దర్శకుడిగా సాయిరాజేశ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాడు. ఇండస్ట్రీలోని సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలను అందుకున్నాడు. తాజాగా ఆయన ఈ సినిమాను గురించిన విషయాలను 'ఐ డ్రీమ్స్' ద్వారా పంచుకున్నాడు. 'బేబి' సినిమాను ఆనంద్ దేవరకొండ చేయడానికి కారకుడు విజయ్ దేవరకొండ అనే చెప్పాలి. నా గురించి ఆయన చెప్పకపోతే, ఈ సినిమా చేయడానికి ఆనంద్ ఆలోచన చేసేవాడేమో చెప్పేలేం" అన్నాడు. 

ఈ సినిమా కోసం నేను కొంతమంది హీరోయిన్స్ ను అనుకున్నాను .. వాళ్లతో మాట్లాడాను. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ .. బోల్డ్ సీన్స్ విషయంలో వాళ్లు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఆ సీన్స్ ప్రధానం కనుక వాటిని మార్చడానికి నేను ఒప్పుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో నా దగ్గరికి వైష్ణవి చైతన్య ఫోటోస్ వచ్చాయి. బోల్డ్ సీన్స్ ఉంటాయని ముందుగా చెప్పిన తరువాతనే ఆమెను ఆఫీస్ కి పిలిపించాము" అని చెప్పాడు. 

"అంతకుముందు నేను ఆమె సిరీస్ కొన్ని చూశాను .. చాలా చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ ను కూడా తాను అద్భుతంగా ఇవ్వగలదనే విషయం నాకు తెలుసు. ఆఫీసుకి వచ్చిన తరువాత వైష్ణవిని నేరుగా చూశాను. కథను ఆమె వినే తీరు .. మాట్లాడే పద్ధతి ఇవన్నీ చూసిన తరువాత, కాళ్లు పట్టుకునైనా ఆమెను ఈ సినిమా కోసం ఒప్పించాలని నిర్ణయించుకున్నాను. అలాగే ఆమె పేరెంట్స్ ను ఒప్పించడానికి చాలా కష్టపడ్డాను" అంటూ చెప్పుకొచ్చాడు. 

More Telugu News