PAK Actress: చంద్రయాన్ సక్సెస్.. సొంత దేశంపైనే విమర్శలు గుప్పించిన పాకిస్థాన్ నటి

Pakistan actress Sehar Shinwari praises ISRO
  • ఇస్రో విజయాన్ని అభినందిస్తున్నానన్న సెహర్ షిన్వారీ
  • అన్ని రంగాల్లో ఇండియా - పాకిస్థాన్ మధ్య గ్యాప్ పెరుగుతోందని వ్యాఖ్య
  • ఈ స్థాయికి చేరుకోవాలంటే పాక్ కు మరో రెండు, మూడు దశాబ్దాలు పడుతుందని విమర్శ
చంద్రయాన్-3 సక్సెస్ కావడంతో భారత్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. పాకిస్థానీలు సైతం భారత్ ను ప్రశంసిస్తున్నారు. ఇదే సమయంలో తమ సొంత దేశంపై విమర్శలు గుప్పిస్తున్నారు. పాక్ సినీ నటి సెహర్ షిన్వారీ భారత్ విజయాన్ని ప్రశంసించింది. ఇండియాతో ఉన్న శత్రుత్వాన్ని పక్కన పెడితే.. చంద్రయాన్-3 విజయం ద్వారా అంతరిక్ష రంగంలో ఇస్రో సాధించిన ఘన విజయాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని తెలిపింది. అన్ని రంగాల్లో ఇండియా, పాకిస్థాన్ మధ్య గ్యాప్ పెరుగుతూనే ఉందని చెప్పింది. ఇప్పుడు ఇండియా ఉన్న స్థాయికి చేరుకోవాలంటే పాకిస్థాన్ కు మరో రెండు, మూడు దశాబ్దాల కాలం పడుతుందని విమర్శించింది. మన ఈ దారుణ స్థితికి ఎవరూ కారణం కాదని... మనకు మనమే కారణమని వ్యాఖ్యానించింది.
PAK Actress
Sehar Shinwari
Chandrayaan-3
ISRO
India
Pakistan

More Telugu News