Tollywood: శ్రీలీలకు పరీక్షా కాలం.. రెండు నెలలు సినిమాలకు బ్రేక్!

Sreeleela to take 2 months break from movies for studies

  • ఎంబీబీఎస్ చివరి ఏడాది చదువుతున్న యువ నటి
  • పరీక్షలకు సిద్ధమయ్యేందుకు విరామం తీసుకున్న హీరోయిన్‌
  • రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న స్కంద, ఆది కేశవ

తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్నాళ్లుగా మార్మోగుతున్న పేరు శ్రీలీల. టాలీవుడ్లో ఎక్కువగా బిజీగా ఉన్న నటి ఆమెనే. యువ హీరోలతో పాటు టాప్ స్టార్ల వరకూ ఆమె చేతి నిండా సినిమాలు ఉన్నాయి. రామ్ పోతినేని సరసన నటించిన ‘స్కంద’, వైష్ణవ్ తేజ్ సరసన నటించిన ‘ఆది కేశవ’ రిలీజ్‌ కు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు మహేశ్ బాబు, బాలకృష్ణ, నితిన్, విజయ్ దేవరకొండ, పవన్‌ కల్యాణ్ సినిమాలతో శ్రీలీల క్షణం తీరికలేకుండా ఉంది. అయితే, ఆమె జోరుకు కొన్నాళ్లు బ్రేక్ పడనుంది. 

డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయిన ఈ అందాల తార ప్రస్తుతం ఎంబీబీస్ చివరి సంవత్సరం చదువుతోంది. ఫైనలియర్ పరీక్షలు దగ్గరపడుతుండటంతో రెండు నెలల పాటు సినిమాలకు బ్రేక్ తీసుకోవాలని శ్రీలీల కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తన పరీక్షల విషయం దర్శక, నిర్మాతలకు చెప్పి నవంబర్ నుంచి జనవరి వరకు కొన్ని కీలక ప్రాజెక్ట్స్ నుంచి శ్రీలీల బ్రేక్ తీసుకోనుందని సమాచారం. ప్రస్తుతం శ్రీలీల పరీక్షా కాలంలో ఉంది. అయితే, ఆయా చిత్రాల్లో ఆమె డేట్లను మార్చడం దర్శక, నిర్మాతలకు కూడా పరీక్షే కానుంది.

Tollywood
sreeleela
break
MBBS
exams
  • Loading...

More Telugu News