Devineni Uma: తల్లిని, చెల్లిని గెంటేసిన వ్యక్తికి పరువు ఉంటుందా?: దేవినేని ఉమా

Devineni fires on Jagan

  • లోకేశ్ కు నోటీసులు జారీ చేసిన పోలీసులు
  • కృష్ణా జిల్లా వైసీపీ నేతలు జగన్ బూట్లు నాకుతున్నారని విమర్శ
  • ప్రతి బూతు మాటకు ప్రజలు ఓట్ల రూపంలో బుద్ధి చెపుతారని వ్యాఖ్య

సీఎం జగన్, కొడాలి నాని, వల్లభనేని వంశీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ యువనేత నారా లోకేశ్ కు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, జగన్ పై విమర్శలు గుప్పించారు. తల్లిని, చెల్లిని గెంటేసిన వ్యక్తికి, బాబాయ్ ని హత్య చేయించిన వాడికి పరువు ఉంటుందా? అని ప్రశ్నించారు. అవినీతి సొమ్మును కాపాడుకోవడానికి జగన్ బూట్లను కృష్ణా జిల్లా వైసీపీ నేతలు నాకుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల ప్రతి బూతు మాటకు ఓట్ల రూపంలో ప్రజలు బుద్ధి చెపుతారని అన్నారు.

Devineni Uma
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
  • Loading...

More Telugu News