Bathini Harinath Goud: 'చేపమందు'కి ప్రసిద్ధిగాంచిన బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

Bathini Harinath Goud passes away

  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం అర్ధరాత్రి కన్నుమూత
  • నేడు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యుల ఏర్పాట్లు
  • చేపమందు పంపిణీతో దేశవ్యాప్తంగా బత్తిని సోదరులకు గుర్తింపు
  • నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏటా  చేపమందు పింపిణీ కార్యక్రమం నిర్వహణ
  • బత్తిని సోదరుల ఔషధం కోసం దేశ్యాప్తంగా వేలాది మంది ఆస్తమారోగుల హాజరు


ఆస్తమా బాధితుల చేపమందు పంపిణీకి ప్రసిద్ధిగాంచిన బత్తిని సోదరుల్లో ఒకరై హరినాథ్ గౌడ్(84) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్ధరాత్రి తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నేటి సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. బత్తిని హరినాథ్ గౌడ్‌కు భార్య సుమిత్రదేవి, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పాతబస్తీలోని దూద్ బౌలికి చెందిన మొత్తం ఐదుగురు బత్తిని సోదరుల్లో హరినాథ్ గౌడ్ కూడా ఒకరు. 1983లో ఆయన భోలక్‌పూర్ పద్మాశాలి కాలనీకి తన నివాసం మార్చారు. 

బత్తిని సోదరులు కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో చేపమందు పంపిణీ చేస్తున్నారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రతి సంవత్సరం బత్తిని సోదరులు ఇచ్చే చేపమందు కోసం దేశవ్యాప్తంగా ఆస్తమా రోగులు వేల సంఖ్యలో తరలివస్తారు.

Bathini Harinath Goud
Hyderabad
Telangana
Andhra Pradesh
  • Loading...

More Telugu News