Joe Biden: ఇండియాకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

US President Joe Biden coming to India

  • నాలుగు రోజుల పాటు ఇండియాలో పర్యటించనున్న జో బైడెన్
  • సెప్టెంబర్ 7 నుంచి 10 మధ్య కొనసాగనున్న పర్యటన
  • అధికారికంగా ప్రకటించిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ త్వరలోనే మన దేశంలో పర్యటించబోతున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. సెప్టెంబర్ 7 నుంచి 10 మధ్య బైడెన్ పర్యటన కొనసాగుతుంది. ఢిల్లీలో జరిగే జీ 20 సమావేశాల కోసం ఆయన భారత్ కు విచ్చేయనున్నారు. బైడెన్ పర్యటనను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ అధికారికంగా ప్రకటించారు. జీ 20 సమావేశాల్లో బైడెన్ పలు కీలక అంశాలపై ప్రసంగిస్తారు. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం, యుద్ధం వల్ల తలెత్తిన ఆర్థిక, సామాజిక మార్పులు, వాతావరణ మార్పులు, బ్యాంకుల సామర్థ్యాన్ని పెంచడం వంటి అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు. 2026లో జరిగే జీ 20 సదస్సుకు అమెరికా ఆతిథ్యం ఇచ్చే అంశంపై కూడా ఆయన మాట్లాడతారు.

Joe Biden
USA
India
G 20
  • Loading...

More Telugu News