Naveen Krishna: పవిత్ర లోకేశ్ గురించి స్పందించిన నరేశ్ తనయుడు నవీన్!

Naveen Krishna Interview

  • నరేశ్ పెళ్లి గురించి ప్రస్తావించిన నవీన్ 
  • ఎవరికి నచ్చినట్టుగా వారు బ్రతకొచ్చని వ్యాఖ్య 
  • అందరికీ నచ్చేలా జీవించడం కష్టమని వెల్లడి 
  • పవిత్ర లోకేశ్ చాలా సైలెంట్ .. చాలా స్ట్రాంగ్ అంటూ కితాబు

నరేశ్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ, చాలా కాలం క్రితమే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  'నందినీ నర్సింగ్ హోమ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయనకి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. ఒక వైపున నటుడిగా కొనసాగుతూనే, మరో వైపున దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.
 
తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నరేశ్ - పవిత్ర లోకేశ్ పెళ్లి గురించి ప్రస్తావించారు. "మా నాన్నగారు పవిత్ర లోకేశ్ ను వివాహం చేసుకున్నారు. ఈ విషయంలో ఆయనను ఎంతో మంది విమర్శించారు. ఒక కొడుకుగా నేను మాత్రం ఆయన హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాను" అన్నారు. 

 "ఏం చేయాలనేది నాన్నగారికి తెలుసు ..  మన మనసుకి నచ్చిన పనిని చేసుకుంటూ వెళ్లడమే కరెక్టు అనేది నా అభిప్రాయం కూడా. కామెంట్స్ కాలంలో చాలామంది ఉంటూనే ఉంటారు. వాళ్లందరికీ సంతృప్తి కలిగేలా బ్రతకడం కష్టం. పవిత్ర లోకేశ్ గారి విషయానికొస్తే ఆమె చాలా కాలంగా నాకు తెలుసు. ఆమె చాలా సైలెంట్ .. అదే సమయంలో అంతే స్ట్రాంగ్ గా కూడా ఉంటారు. అలాంటివారు చాలా తక్కువ మంది ఉంటారు" అని చెప్పుకొచ్చారు. 

Naveen Krishna
Naresh
Pavithra Lokesh
  • Loading...

More Telugu News