Pakistan: చంద్రయాన్-3 మిషన్ కు పాక్ మాజీ మంత్రి ప్రశంసలు

Pak Ex Minister Praises Chandrayaan 3 Mission
  • మొత్తం మానవాళికే చారిత్రాత్మక క్షణమని పొగడ్త
  • పాకిస్థాన్ లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిమాండ్
  • భారత సైంటిస్టులకు, ప్రజలకు అభినందనలు తెలిపిన ఫవాద్ చౌదరి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రయోగం చంద్రయాన్-3 పై పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగిడే క్షణం భారతీయులకే కాదు మొత్తం మానవాళికే చారిత్రాత్మక క్షణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు భారతీయులందరికీ ఫవాద్ అభినందనలు తెలిపారు. అదేవిధంగా, చంద్రయాన్-3 ల్యాండింగ్ ను పాకిస్థాన్ లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు ఫవాద్ చౌదరి మంగళవారం ట్వీట్ చేశారు.

ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఫవాద్ చౌదరి.. తాజాగా చంద్రయాన్-3 ప్రాజెక్టును మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్టులో కీలక ఘట్టమైన విక్రమ్ ల్యాండింగ్ ను భారత్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారని, పాకిస్థాన్ ప్రజలకు కూడా లైవ్ లో చూసే అవకాశం కల్పించాలంటూ పాకిస్థాన్ మీడియాకు ఫవాద్ విజ్ఞప్తి చేశారు.
Pakistan
Ex minister
Pawad chaudary
tweet
Chandrayaan-3
live streaming

More Telugu News