Yarlagadda Venkatarao: కొడాలి నాని పెళ్లికి నందమూరి హరికృష్ణ ఎందుకు రాలేదు?: యార్లగడ్డ వెంకట్రావు

Yarlagadda Venkatarao fires on Kodali Nani

  • కొడాలి నానిపై ధ్వజమెత్తిన యార్లగడ్డ
  • కొడాలి నాని వల్లే గుడివాడలో హరికృష్ణ ఓడిపోయాడని వ్యాఖ్య  
  • రాజకీయ లబ్ది కోసమే హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పేర్లు వాడుకుంటాడని విమర్శలు

ఇటీవల టీడీపీలో చేరిన గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై ధ్వజమెత్తారు. కొడాలి నాని వల్లే గతంలో నందమూరి హరికృష్ణ గుడివాడలో ఓడిపోయారని వెల్లడించారు. కొడాలి నాని పెళ్లికి హరికృష్ణ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. 

కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కొడాలి నాని... హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల పేర్లు వాడుకుంటాడని విమర్శించారు. కొడాలి నాని మాట్లాడుతున్న మాటలు తెలుగు భాషకే అవమానం అని యార్లగడ్డ మండిపడ్డారు. పార్టీ కోరుకుంటే గుడివాడ వెళ్లి కొడాలి నానిపై పోటీ చేసేందుకైనా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. 

గన్నవరం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే ప్రాంతం అని, టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా మారిందని యార్లగడ్డ వివరించారు. గతంలో కొనకళ్ల నారాయణ ఎంపీగా గెలిచేందుకు ప్రధాన కారణం గన్నవరం నియోజకవర్గమేనని అన్నారు. ఆ తర్వాత వైసీపీ ఎంపీ బాలశౌరికి గన్నవరంలో 10 వేల ఓట్ల మెజారిటీ వచ్చిందని తెలిపారు. 

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో మంచి పోలీసు అధికారులు ఉండి ఉంటే తానే గెలిచేవాడ్నని యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడ్నించైనా పోటీ చేస్తానని, గన్నవరం నియోజకవర్గాన్ని టీడీపీ ఖాతాలో వేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Yarlagadda Venkatarao
Kodali Nani
Harikrishna
Junior NTR
Gannavaram
Krishna District
  • Loading...

More Telugu News