Vaishnavi: 'బేబి' నుంచి వైష్ణవి సెలబ్రేషన్ డాన్స్ వీడియో!

Baby Celebration Dance Video

  • భారీ విజయాన్ని అందుకున్న 'బేబి'
  • డాన్స్ పరంగాను వైష్ణవికి మంచి మార్కులు 
  • మాస్ డాన్స్ బిట్ ను రిలీజ్ చేసిన టీమ్ 
  • ఈ నెల 25 నుంచి ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్

ఈ మధ్య కాలంలో అనూహ్యమైన రెస్పాన్స్ ను .. వసూళ్లను చూసిన సినిమాలలో 'బేబి' ఒకటిగా నిలిచింది. యూత్ కి ఎక్కువగా కనెక్ట్ అయిన కథగా .. కదిలించిన సినిమాగా 'బేబి' గురించి చెప్పుకోవచ్చు. ఈ సినిమాతోనే వైష్ణవి చైతన్య హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె రెండు విభిన్నమైన కోణాలు కలిగిన పాత్రలో మెప్పించింది. 

డీ గ్లామర్ పాత్రగా ఆమె ఉన్నప్పుడు, గణేశ్ ఉత్సవం సందర్భంగా ఆమె అక్కడ మాస్ డాన్స్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే 'దసరా' సినిమాలో కీర్తి సురేశ్ చేసిన డాన్స్ లాంటిది. ఎలాంటి పాట లేకుండా ఒక మ్యూజిక్ లెంగ్త్ లో డాన్స్ సాగుతుంది.  వైష్ణవి మంచి డాన్సర్ అనే విషయం ఈ డాన్స్ తోనే ఆడియన్స్ కి అర్థమైపోతుంది. 

వైష్ణవి చేసిన ఆ డాన్స్ ను కొంతసేపటి క్రితం ఈ సినిమా టీమ్ రిలీజ్ చేసింది. సినిమాలో వైష్ణవి డాన్స్ ను .. ఆ మ్యూజికల్ బీట్ ను ఎంజాయ్ చేసిన వారికి ఇది మరో అవకాశం. ఇక ఈ సినిమా ఈ నెల 25వ తేదీన 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మీద కూడా ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

More Telugu News