Harish Rao: మా పార్టీలో టిక్కెట్ రానివారి కోసం బీజేపీ ఎదురు చూస్తోంది: హరీశ్ రావు

Harish rao says BJP is waiting for BRS leaders

  • బీజేపీకి క్యాడర్ లేదని, కాంగ్రెస్‌కు లీడర్ లేడని విమర్శ
  • కేసీఆర్ తన వ్యూహంతో ప్రతిపక్షాలను కకావికలం చేశారని వ్యాఖ్య
  • మెదక్ జిల్లాలోని అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా

తెలంగాణలో బీజేపీకి క్యాడర్ లేదు, కాంగ్రెస్‌కు లీడర్ లేడని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ... ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ముందుగానే ప్రకటించడం ద్వారా కేసీఆర్ తన వ్యూహంతో ప్రతిపక్షాలను కకావికలం చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ పథకాలను కాపీ చేస్తోందన్నారు. తమ పార్టీలో టిక్కెట్ రానివారి కోసం బీజేపీ ఎదురు చూస్తోందని ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లాలోని అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లను అమ్ముకుంటోందని విమర్శించారు. కాగా, ఈ నెల 23వ తేదీన మెదక్ జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతో పాటు బీఆర్ఎస్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారన్నారు. ఆసరా పెన్షన్ పెంపును మెదక్ నుండే సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారన్నారు. దివ్యాంగులకు ఆసరా పెన్షన్ రూ.4,016కు పెంచుతున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News