K Kavitha: హరీశ్ రావుపై మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha condemns Mynampalli comments on Harish rao

  • సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసిన కవిత
  • తెలంగాణ పట్ల హరీశ్ రావు నిబద్ధత అనిర్వచనీయమన్న ఎమ్మెల్సీ
  • బీఆర్ఎస్ పార్టీకి, ప్రజలకు ఎంతో సేవ చేశారని కితాబు

మంత్రి హరీశ్‌రావు పట్ల మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ మేరకు సోమవారం ఆమె సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ట్వీట్ చేశారు. తెలంగాణ పట్ల సీనియర్ నాయకులు హరీశ్ రావు నిబద్ధత, బీఆర్ఎస్ పార్టీకి, ప్రజలకు చేసిన సేవలు అనిర్వచనీయమైనవన్నారు. హరీశ్ రావుపై ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా, మైనంపల్లిపై బీఆర్ఎస్ అధిష్ఠానం చర్యలకు సిద్ధమవుతోన్నట్లుగా తెలుస్తోంది. హరీశ్ రావుపై ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పార్టీ పెద్దలు చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఏ సమయంలో అయినా నిర్ణయం తీసుకోవచ్చునని అంటున్నారు.

K Kavitha
mynampalli hanmantha rao
Harish Rao
BRS
  • Loading...

More Telugu News