Samantha: అమెరికాలో ఇండియా డే పరేడ్... న్యూయార్క్ నగర మేయర్ ను కలిసిన సమంత

Samantha met New York city Mayor Eric Adams

  • అమెరికా పర్యటనకు వెళ్లిన సమంత
  • న్యూయార్క్ నగరంలో ఇండియా డే పరేడ్ వేడుకలు
  • ఇండో అమెరికన్ సమాజంలో సమంత సందడి

అందాల సమంత అమెరికాలో పర్యటిస్తున్నారు. ప్రతి ఏటా జరిగే ఇండియా డే పరేడ్ వేడుకల్లో ఆమె పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ను కలిశారు. 

41వ వార్షిక ఇండియా డే పరేడ్ కు న్యూయార్క్ నగరం ఆతిథ్యమిస్తోంది. ఈ ఉత్సవాలను ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ ఇన్ న్యూయార్క్ అనే ప్రవాస భారతీయుల సంస్థ నిర్వహిస్తోంది. సమంత రాకతో ఇక్కడ సందడి మరింత పెరిగింది. 

ఇక, న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ను కలిసిన సందర్భంగా సమంత కెమెరాల ముందుకొచ్చింది. ఇరువురు హార్ట్ ఎమోజీని ప్రదర్శించగా, కెమెరాలు క్లిక్ మన్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. 

సమంత నటించిన ఖుషి చిత్రం సెప్టెంబరు 1న విడుదల కానుంది. ఈ చిత్రంలో సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించారు. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే విశేష ప్రజాదరణ పొందాయి. ఈ చిత్ర ప్రమోషన్స్ లో ఇటీవలి వరకు పాల్గొన్న సమంత... కొన్ని రోజుల కిందటే అమెరికా వెళ్లారు.

Samantha
Eric Adams
Mayor
New York City
  • Loading...

More Telugu News