Anushka Shetty: ఆసక్తికరమైన కాన్సెప్టుతో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' .. ట్రైలర్ రిలీజ్!

Miss Shetty Mr Polyshetty Trailer Released

  • అనుష్క, నవీన్ పోలిశెట్టి జంటగా సినిమా  
  • ఆసక్తిని పెంచుతున్న లేటెస్ట్ ట్రైలర్
  • ప్రేమ - పెళ్లి పట్ల నమ్మకం లేని పాత్రలో అనుష్క 
  • సెప్టెంబర్ 7వ తేదీన సినిమా విడుదల

అనుష్క - నవీన్ పోలిశెట్టి జంటగా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా రూపొందింది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి మహేశ్ బాబు పి. దర్శకత్వం వహించాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అనుష్క - నవీన్ పోలిశెట్టి పాత్రలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. 
 
ఈ సినిమాలో అనుష్క పాత్ర పేరు అంకిత. తనకి తల్లిని కావాలని ఉంటుంది. కానీ ప్రేమ - రిలేషన్ షిప్ .. పెళ్లి అనే విషయాలపై ఆమెకి ఎలాంటి నమ్మకం ఉండదు. అందువలన తాను తల్లిని కావడానికి ఒక యువకుడి సాయాన్ని తీసుకోవాలని అనుకుంటుంది. స్టాండ్ అప్ కామెడీ చేసే సిద్ధూతో ఆ విషయాన్ని చెబుతుంది. 

అంత అందంగా ఉన్న ఆమె, తనకి ఎలాంటి ఫీలింగ్స్ లేవని .. రావని చెప్పడంతో అతను షాక్ తింటాడు. ఆ తరువాత ఏం జరుగుతుందనేది అసలు కథ. కాన్సెప్ట్ అర్థమయ్యేలా కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని పెంచేలా ఉంది. మురళీ శర్మ - తులసి ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, సెప్టెంబర్ 7వ తేదీన థియేటర్లకు రానుంది.

More Telugu News