Upasana: ఈ బ్రాంచి మా అమ్మమ్మకు అంకితం: ఉపాసన

Upasana on her grand mother birthday

  • హైదరాబాదులో అపోలో ఆసుపత్రి కొత్త బ్రాంచి
  • నానక్ రామ్ గూడలో ఏర్పాటు
  • ఇవాళ ఉపాసన అమ్మమ్మ సుచరిత పుట్టినరోజు
  • ఈ దినం తమకెంతో ప్రత్యేకమన్న ఉపాసన

మెగా కోడలు ఉపాసన అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ అని తెలిసిందే. తాజాగా, హైదరాబాదు నానక్ రామ్ గూడలో అపోలో ఆసుపత్రి కొత్త బ్రాంచి ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆసుపత్రికి నేడు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాసన పాల్గొన్నారు.

ఇవాళే ఆ కార్యక్రమం నిర్వహించడానికి ఓ కారణం ఉంది. అపోలో ప్రతాపరెడ్డి అర్ధాంగి, ఉపాసన అమ్మమ్మ సుచరిత రెడ్డి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దీనిపై ఉపాసన స్పందించారు. 

నానక్ రామ్ గూడలోని అపోలో కొత్త బ్రాంచిని అమ్మమ్మకు అంకితం ఇస్తున్నట్టు వెల్లడించారు. ఆమె పుట్టినరోజు తమకెంతో ప్రత్యేకం అని, అందుకే ఇవాళ ఆసుపత్రికి శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. త్వరలోనే ఈ ఆసుపత్రి వైద్య సేవలు అందిస్తుందని ఉపాసన ఇన్ స్టాగ్రామ్ లో వివరించారు.

Upasana
Sucharitha Reddy
Grand Mother
Apollo Hospital
Nanakram Guda
Hyderabad
  • Loading...

More Telugu News