Akira Nandan: అమెరికాలోని ఫిల్మ్ స్కూల్లో చేరిన పవన్ కల్యాణ్ తనయుడు అకీరా

Pawan Kalyan son Akira Nandan joins film school in USA

  • ఇటీవల నార్వేలో బాహుబలి సింఫనీ కాన్సెర్ట్
  • హాజరైన రాఘవేంద్రరావు, రేణూ దేశాయ్ తదితరులు
  • తన మనవడు కార్తికేయ, అకీరాలతో ఫొటోకు పోజు ఇచ్చిన రాఘవేంద్రరావు 
  • అకీరా, కార్తికేయ ఫిల్మ్ స్కూల్లో చేరారని వెల్లడించిన దర్శకేంద్రుడు

టాలీవుడ్ పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ అమెరికాలోని ఓ ఫిల్మ్ స్కూల్లో చేరాడు. ఈ విషయాన్ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వెల్లడించారు. ఇటీవల నార్వేలోని స్టావెంజర్ లో బాహుబలి చిత్రం మ్యూజిక్ సింఫనీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి, రాఘవేంద్రరావు, రేణూ దేశాయ్ తదితర ప్రముఖులు విచ్చేశారు. 

ఈ సందర్భంగా రాఘవేంద్రరావు తన మనవడు కార్తికేయ, అకీరా నందన్ లతో కలిసి ఫొటోకు పోజు ఇచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ... "నాలుగోతరం వారసులతో కలిసి నార్వేలో ఉన్నాను. నా మనవడు కార్తికేయ, పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్... వీరిద్దరూ అమెరికాలోని ఫిల్మ్ స్కూల్లో చేరారు" అని వెల్లడించారు. ఈ మేరకు వారిద్దరితో తాను కలిసి ఉన్నప్పటి ఫొటోను రాఘవేంద్రరావు పంచుకున్నారు. 

పవన్ తనయుడు అకీరా ఇప్పటికే పలు రూపాల్లో తన ప్రతిభను చాటుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ లోనూ, సంగీతంలోనూ శిక్షణ పొందిన ఈ మెగా ఇంటి కుర్రాడు ఇప్పుడు సినిమాల దిశగా తొలి అడుగు వేయడంతో పవన్ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు.

Akira Nandan
Pawan Kalyan
Film School
K.Raghavendrarao
Kartikeya
USA
Tollywood
  • Loading...

More Telugu News