Samantha: న్యూయార్క్‌లో ‘ఇండియా డే పరేడ్‌’.. సందడి చేసిన సమంత!

samantha participate in india day parade in new york city

  • స్వాత్రంత్ర్య దినోత్సవాల సందర్భంగా న్యూయార్క్‌లో ఇండియా డే పరేడ్
  • వేడుకల్లో పాల్గొనడం చాలా గర్వంగా ఉందన్న సమంత
  • ఈ క్షణాలు మనస్సులో జీవితమంతా నిలిచిపోతాయని వ్యాఖ్య

అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ‘ఇండియా డే పరేడ్‌’లో హీరోయిన్ సమంత పాల్గొన్నారు. న్యూయార్క్‌ వీధుల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. “ఈ రోజు న్యూయార్క్‌లో ఉండటం చాలా గర్వంగా ఉంది. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎంత గొప్పవో, ఈ రోజు నేను చూసిన దృశ్యాలు మరోసారి అర్థమయ్యేలా చేశాయి” అని చెప్పారు.

ఈ క్షణాలు తన మనస్సులో జీవితమంతా నిలిచిపోతాయని సమంత అన్నారు. ఈ అరుదైన గౌరవం తనకు దక్కేలా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. తన సినిమాలను అలరిస్తున్నందుకు అమెరికా ప్రజలకు కూడా కృతజ్ఞతలు చెప్పారు.

భారత స్వాత్రంత్ర్య దినోత్సవాల సందర్భంగా ప్రతి ఏటా న్యూయార్క్‌లో ఇండియా డే పరేడ్ నిర్వహిస్తుంటారు. ఆదివారం మధ్యాహ్నం (స్థానిక కాలమానం ప్రకారం) జరిగిన వేడుకలకు ప్రముఖ నటులు, ప్రముఖులతో కలిసి సమంత హాజరయ్యారు. ఆధ్యాత్మిక గురువు రవి శంకర్, బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఇక గతంలో ఈ వేడుకలకు అల్లు అర్జున్, అభిషేక్ బచ్చన్, రానా దగ్గుబాటి తదితరులు హాజరయ్యారు.

Samantha
India Day Parade
new york
Jacqueline Fernandez
Sri Sri Ravi Shankar
  • Loading...

More Telugu News