Kavya Thapar: 'ఈగల్' పై గట్టిగానే నమ్మకం పెట్టుకున్న కావ్య థాఫర్!

Eagle movie Update

  • 2018లో ఎంట్రీ ఇచ్చిన కావ్య థాపర్ 
  • గ్లామర్ పరంగా మంచి మార్కులు 
  • ఆరంభంలో పలకరించని విజయాలు
  • 'బిచ్చగాడు 2'తో దక్కిన గుర్తింపు 
  • ఆశలన్నీ 'ఈగల్' సినిమాపైనే  


తెలుగు తెరకి పరిచయమైన బొద్దు భామలలో 'కావ్య థాపర్' ఒకరు. 2018లో ఈ బ్యూటీ 'ఈ మాయ పేరేమిటో' సినిమాతో పరిచయమైంది. అయితే ఆ సినిమా ఫలితం ఆమెను నిరాశపరిచింది. ఆ తరువాత చేసిన 'ఏక్ మినీ కథ' మాత్రం మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అయినా ఆమెకి వరుస ఆఫర్లు వచ్చిపడలేదు. దాంతో ఆమె వెబ్ సిరీస్ లపై ఎక్కువగా శ్రద్ధ పెట్టింది. 

ఈ నేపథ్యంలో తమిళంలో చేసిన 'బిచ్చగాడు 2' అక్కడ మాత్రమే కాదు, తెలుగులోను మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె రవితేజ జోడీగా 'ఈగల్' సినిమాలో కనిపించనుంది. తెలుగులో ఆమె చేస్తున్న పెద్ద సినిమా ఇదేనని చెప్పాలి. ఇక్కడ రవితేజ వంటి ఒక స్టార్ హీరో సరసన చేయడం కూడా ఇదే ఫస్టు టైమ్. 

విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాకి, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. ముఖ్యమైన పాత్రలలలో అనుపమ పరమేశ్వరన్ .. మధుబాల .. అవసరాల కనిపించనున్నారు. ఈ సినిమా తరువాత తాను టాలీవుడ్ లో బిజీ అవుతానని కావ్య థాపర్ భావిస్తోంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.

More Telugu News