Arif Alvi: అల్లాయే సాక్ష్యం.. ఆ బిల్లులపై సంతకాలు చేయలేదు.. బాంబు పేల్చిన పాక్ అధ్యక్షుడు
- బిల్లులను నిర్దిష్ట సమయంలో తిరిగి పంపమని చెప్పానన్న అధ్యక్షుడు
- సిబ్బందే తనను మోసం చేశారని ఆవేదన
- అల్వీ వ్యాఖ్యలను ఖండించిన న్యాయశాఖ
- నిర్దిష్ట సమయంలో పంపకపోవడంతోనే బిల్లులు చట్టంగా మారాయని వివరణ
చట్టంగా రూపొందించిన అధికార రహస్యాలు, పాక్ సైన్య చట్టాల సవరణ బిల్లులపై తాను సంతకం చేయలేదని పాక్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ బిల్లులను తాను వ్యతిరేకించానని, సంతకం చేయని ఆ బిల్లులను నిర్దిష్ట సమయంలో తిరిగి పంపమని చెప్పానని, అందుకు అల్లాయే సాక్ష్యమని పేర్కొన్నారు. కానీ తన సిబ్బందే తనను మోసం చేశారని, తన అధికారాన్ని ఖాతరు చేయలేదని వాపోయారు. అయితే, న్యాయశాఖ మాత్రం అల్వీ ప్రకటనను ఖండించింది. రాజ్యాంగంలోని అధికరణం 5 కింద నిర్దిష్ట సమయంలో బిల్లులను పంపలేదని, అందుకే అవి చట్టాలుగా మారాయని స్పష్టం చేసింది.
ప్రస్తుతం జైలులో ఉన్న పాక్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌కు అల్వీ సన్నిహితుడన్న పేరుంది. చట్టంగా రూపొందించిన అధికార రహస్యాల చట్టం ప్రకారమే ఇమ్రాన్‌ఖాన్ మరో స్నేహితుడైన షా మహమ్మద్ ఖురేషీని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు.