Woman: అదో ఆనందం.. మెట్రోలో యువతి చేసిన పని చూడండి..!

Woman performs somersault inside metro video sparks debate
  • పిల్లేరు గంతులు వేసిన యువతి
  • వీడియో తీసి ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్
  • మెట్రో ఇలాంటి వాటికి వేదిక కాదంటూ నెటిజన్ల చురక
పట్టణాల్లో వేగవంతమైన ప్రయాణానికి మెట్రో రైలు వీలు కల్పిస్తోంది. అయితే ఈ మెట్రో వసతులను కొందరు తమ నైపుణ్యాల ప్రదర్శన కేంద్రాలుగా మలుచుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ మెట్రో తరచూ ఏదో విధంగా వార్తల్లో ఉండడాన్ని గమనించొచ్చు. శృంగారం నుంచి డ్యాన్స్ ల వరకు ఢిల్లీ మెట్రో ఎంతో మంది ప్రదర్శనలకు కేంద్రంగా మారిందనడంలో సందేహం లేదు. మెట్రో రైలు నిర్వహణ సంస్థ కూడా ఈ విషయంలో ఎన్నో సందర్భాలు ప్రయాణికులను హెచ్చరిస్తూ, సూచనలు చేస్తూనే ఉంది.

అయినా కానీ ప్రజల్లో మార్పు రావడం లేదు. కొందరి ధోరణి మారడం లేదు. అథ్లెట్ నైపుణ్యాలు ఉన్న మిషా శర్మ అనే యువతి ప్రయాణికులతో రద్దీగా ఉన్న మెట్రోలో పిల్లేరు గంతులు వేసింది. దీన్ని వీడియో తీయించి మరీ, తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. కొందరికి ఈ తరహా ఫీట్లు వినోదాన్ని కలిగించొచ్చు. కానీ అదే సమయంలో ఎంతో మంది ప్రయాణికులకు అసౌకర్యానికి దారితీయవచ్చు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె నైపుణ్యాలను మెచ్చుకుంటుంటే, కొందరు మాత్రం అలాంటి చర్యలకు మెట్రో వేదిక కాదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. (వీడియో కోసం)
Woman
circus
feets
metro rail

More Telugu News