KTR: బాల్యం నుంచి ఇప్పటివరకు... తనయుడు హిమాన్షు ఫొటోలు పంచుకున్న కేటీఆర్

KTR shares pictures of his son Himanshu

  • మరోసారి పుత్రోత్సాహం ప్రదర్శించిన మంత్రి కేటీఆర్
  • బిడ్డ పుట్టినప్పటి నుంచి ఎదిగే వరకు ప్రతి తండ్రీ ఇలాగే ఫొటోలు తీస్తుంటాడని వెల్లడి
  • ఎంత ఎదిగాడో తలుచుకుంటే నమ్మబుద్ధి కావడంలేదని వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి పుత్రోత్సాహాన్ని ప్రదర్శించారు. బాల్యం నుంచి ఇప్పటివరకు తనయుడు హిమాన్షు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. బిడ్డ పుట్టినప్పటి నుంచి ఎదిగేవరకు ప్రతి తండ్రి ఇలాగే ఫొటోలు తీస్తుంటాడని వెల్లడించారు. 

"నిన్న మొన్నటిదాకా అల్లరి గడుగ్గాయిలా ఉన్న పిల్లవాడు ఇప్పుడు పెద్దవాడై కాలేజీకి వెళుతున్నాడంటే నమ్మలేకపోతున్నాను. హిమాన్షు ఎదిగే కొద్దీ నాలో ఒక భాగంలా మారిపోతున్నాడు" అని వెల్లడించారు. 

అంతేకాదు, కుటుంబంతో కలిసి అమెరికా టూర్ వెళుతున్నానని, కుటుంబ పెద్దగా నిర్వర్తించాల్సిన విధుల్లో ఇదొకటని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పర్యటన వారం రోజులు ఉంటుందని, ఈ విహారయాత్రలో భాగంగానే కొన్ని అధికారిక పనులు కూడా నిర్వర్తించాల్సి ఉందని తెలిపారు.

KTR
Himanshu
Photos
BRS
Telangana
  • Loading...

More Telugu News