Ram Charan: బాలయ్య పట్ల గౌరవాభిమానాలు ప్రదర్శించిన రామ్ చరణ్... వీడియో ఇదిగో!

Ram Charan wishes Balakrishna in Brahmanandam son marriage function

  • హైదరాబాదులో బ్రహ్మానందం చిన్నకుమారుడి వివాహం
  • తరలివచ్చిన టాలీవుడ్ ప్రముఖులు
  • బాలయ్య రాకతో పెళ్లి వేదిక వద్ద భారీ సందడి
  • జనం లోంచి ముందుకు వచ్చి బాలయ్యను పలకరించిన రామ్ చరణ్

టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ్, డాక్టర్ ఐశ్వర్యల వివాహం హైదరాబాదులో గత రాత్రి ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 

కాగా, ఈ వివాహానికి నందమూరి బాలకృష్ణ కూడా విచ్చేశారు. బాలయ్య రాకతో పెళ్లి వేదిక వద్ద భారీ కోలాహలం నెలకొంది. అంతమంది జనం లోంచి రామ్ చరణ్ ముందుకొచ్చి బాలకృష్ణను గౌరవంగా పలకరించడం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా బాలయ్య ఆప్యాయంగా చరణ్ భుజం తట్టారు.

బాలయ్యకు నమస్కరించిన రామ్ చరణ్... ఈ సందర్భంగా తన అర్ధాంగి ఉపాసనను కూడా ఆయనకు పరిచేయం చేశారు. ఉపాసన తనకంటే చిన్నదైనప్పటికీ బాలయ్య ఆమెకు రెండు చేతులు జోడించి నమస్కరించి ఓ మహిళ పట్ల తన సంస్కారం చాటారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

More Telugu News