Brahmanandam: అంగరంగ వైభవంగా బ్రహ్మానందం చిన్న కుమారుడి వివాహం

Actor Brahmanandam younger son marriage in Hyderabad

  • డా. పద్మజ, వినయ్‌ల కుమార్తె ఐశ్వర్యతో బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ వివాహం
  • శుక్రవారం రాత్రి నగరంలోని అన్వయ కన్వెన్షన్‌లో జరిగిన వేడుక
  • నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం కేసీఆర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
  • వేడుకకు హాజరైన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ వివాహం శుక్రవారం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. నగరానికి చెందిన డా. పద్మజ వినయ్‌ల కుమార్తె ఐశ్వర్యతో కలిసి సిద్ధార్థ వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. అన్వయ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సినీ నటులు నందమూరి బాలకృష్ణ, రామ్ చరణ్, మోహన్ బాబు తదితర సినీ రాజకీయ ప్రముఖులు కొత్త దంపతులను ఆశీర్వదించారు. 

More Telugu News