: నేడు పాక్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ ప్రమాణస్వీకారం


పాకిస్థాన్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో పీఎంఎల్-ఎన్ పీపుల్స్ పార్టీ అధినేత మూడోసారి పాకిస్థాన్ కు ప్రధానిగా గద్దెనెక్కనున్నారు. 342 మంది సభ్యులుండే నేషనల్ అసెంబ్లీ(దిగువ సభ)లో పీఎంఎల్-ఎన్ పార్టీకి 180 మందికి పైగా సభ్యుల బలముంది. దీంతో షరీఫ్ ఎన్నిక లాంఛనప్రాయము కాగా, నవాజ్ షరీఫ్ ప్రమాణస్వీకారోత్సవానికి భారత ప్రధానిని ఆహ్వానించారు. అయితే, ముంబై దాడులకు నిరసనగా మన్మోహన్ సింగ్ ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. దీంతో ఈ కార్యక్రమానికి పాక్ లో భారత్ హైకమీషనర్ శరత్ సభర్వాల్ హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News