Harish Rao: బెంగళూరులో కూడా కరెంట్ కోతలున్నాయి: మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao talks about power cut in Bengaluru

  • కాంగ్రెస్ మూడుగంటల కరెంట్ అంటోందన్న మంత్రి
  • బీజేపీ మోటార్లు పెడతామని చెబుతోందని హరీశ్ రావు విమర్శ
  • దేశం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోందన్న హరీశ్ రావు

కాంగ్రెస్ 3 గంటల కరెంట్ అంటోందని, బీజేపీ మోటార్లు పెడతామని చెబుతోందని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం 24 గంటల కరెంట్ ఇస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో 30 ప‌డ‌క‌ల ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలిసిందే ధరలు పెంచడమే అన్నారు. కానీ కేసీఆర్ పేదలకు నిధులు పంచుతాడన్నారు.

కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రంలో 17వేల పడకలు ఉంటే ఇప్పుడు 50వేల పడకలు ఉన్నాయన్నారు. నాడు తెలంగాణలో మూడు మెడికల్ కాలేజీలు ఉస్మానియా, గాంధీ, వరంగల్ ఎంజీఎం ఉండేవని, ఇప్పుడు 33 జిల్లాలకు 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయన్నారు.

ఇప్పుడు దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నామని, కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని కాపీ కొట్టిందన్నారు. రైతుబంధును కాపీ కొట్టి పీఎం కిసాన్ అని పేరు పెట్టారన్నారు. మిషన్ భగీరథను కాపీ కొట్టి హర్ ఘర్ కో జల్ అని పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీయేమో మూడు గంటల విద్యుత్ అంటోందని, బీజేపీ మీటర్లు పెట్టాలని చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం మీటర్లు పెట్టనందుకు రూ.35 వేల కోట్లను కేంద్రం ఆపిందని ఆరోపించారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఎనిమిది గంటల కరెంట్ ఇవ్వలేకపోతోందని, బెంగళూరు నగరంలోను కరెంట్ కోతలు ఉన్నాయన్నారు. కానీ తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు చెప్పారు. బీజేపీ గ్యాస్ సహా అన్ని ధరల్ని పెంచుతోందన్నారు. కానీ మనం ఆడపిల్లల పెళ్లికి కల్యాణ లక్ష్మి, కాన్పుకు వెళ్తే కేసీఆర్ కిట్ ఇస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News