Mammootty: మమ్ముట్టి నుంచి భారీ హారర్ థ్రిల్లర్ గా 'భ్రమయుగం'

Bhramayugam Movie Update

  • మమ్ముట్టి కథానాయకుడిగా 'భ్రమయుగం'
  • కేరళ నేపథ్యంలో సాగే విభిన్నమైన కథ 
  • ఈ రోజునే మొదలైన షూటింగు 
  • వచ్చే ఏడాదిలో ఐదు భాషల్లో విడుదల

మమ్ముట్టి నటన గురించి .. ఆయనకి గల క్రేజ్ ను గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. మలయాళంలోనే కాదు, తెలుగు .. తమిళ భాషల్లోను ఆయనకి గల అభిమానుల సంఖ్య ఎక్కువే. అలాంటి మమ్ముట్టి తన తాజా చిత్రాన్ని ఈ రోజున సెట్స్ పైకి తీసుకుని వెళ్లారు ..  ఆ సినిమా పేరే 'భ్రమయుగం'. ఇది హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ. ఈ రోజునే ఈ సినిమా షూటింగును లాంఛనంగా మొదలుపెట్టారు.

చక్రవర్తి రామచంద్ర - శశికాంత్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మమ్ముట్టి మాట్లాడుతూ .. " ఇది కేరళ నేపథ్యంలో సాగే కథ .. చీకటి యుగాలకి సంబంధించిన కథ. ఈ తరహా కథను .. పాత్రను నేను ఇంతవరకూ చేయలేదు . దర్శకుడు ఈ కథను చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. తప్పకుండా ఇది ఒక ప్రయోగం అవుతుంది" అని అన్నారు.

"ఈ సినిమా కోసం ప్రతిభావంతులైన నటీనటులు .. సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ సినిమాను చూస్తుంటే ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుందని నాకు అనిపించింది. నా కెరియర్లో ఇది ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుందని బలంగా నమ్ముతున్నాను. వచ్చే ఏడాదిలో ఐదు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయడం జరుగుతుంది" అని చెప్పుకొచ్చారు.

Mammootty
Rahul Sadashivan
Chakravarthi Ramachandran
Bhramayugam
  • Loading...

More Telugu News