Sri Vishnu: 50 రోజులను పూర్తిచేసుకున్న 'సామజవరగమన'

Samajavaragamana Movie Update

  • శ్రీవిష్ణు హీరోగా వచ్చిన 'సామజవరగమన'
  • జూన్ 29న విడుదలైన సినిమా
  • ఈ రోజుతో 50 రోజుల పూర్తి 
  • ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై కూడా మంచి రెస్పాన్స్  

ఈ జనరేషన్ హీరోల్లో కామెడీ బాగా చేసేవారి జాబితాలో శ్రీవిష్ణు ఒకరుగా కనిపిస్తాడు. ఆయన కామెడీ టైమింగ్ .. కాస్త వెటకారంతో కూడిన డైలాగ్ డెలివరీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఆయన నుంచి ఇటీవల వచ్చిన 'సామజవరగమన' భారీ విజయాన్ని అందుకుంది. రాజేశ్ దండ నిర్మించిన ఈ సినిమాకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా, గోపీ సుందర్ సంగీతం సమకూర్చాడు.

జూన్ 29వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఈ రోజుతో 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ అధికారిక పోస్టర్ ను విడుదల చేసింది. హీరో - హీరోయిన్ ఇద్దరూ కూడా తమ పెళ్లి జరగడం కోసం వేరే జంట పెళ్లిని ఆపడానికి చేసే ప్రయత్నాల చుట్టూ ఈ కథ నడుస్తూ ఉంటుంది. నరేశ్ - వెన్నెల కిశోర్ కామెడీ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిందని చెప్పచ్చు. 

రియల్ లొకేషన్స్ లో సహజత్వంతో కూడిన చిత్రీకరణ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచింది. గోపీసుందర్ సంగీతం ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. ఇటీవలే ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి కూడా వచ్చేసింది. ఓటీటీ వైపు నుంచి కూడా ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రెబా మోనికా జాన్ కి వరుస అవకాశాలు వచ్చిపడుతుండటం విశేషం.

Sri Vishnu
Rebba Monica John
Naresh
Samajavaragamana
  • Loading...

More Telugu News