Uttar Pradesh: పరమేశ్వరుడికి సమర్పిద్దామని గొంతు కోసుకున్న యువకుడు

UP man cuts his neck to offer to Lord Shiva critical

  • యూపీలోని లలిత్ పూర్ లో జరిగిన దారుణం
  • ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో బాధితుడు
  • శివుడిపై ఉన్న భక్తితోనే అలా చేసినట్టు పోలీసుల వెల్లడి

ఉత్తరప్రదేశ్ లో ఓ యువకుడు పరమశివుడిపై ఉన్న భక్తి భావంతో అనుచిత చర్యకు పాల్పడ్డాడు. 30 ఏళ్ల యువకుడు మంగళవారం తెల్లవారుజామున శివాలయానికి వెళ్లి ఎలక్ట్రికల్ పనులలో ఉపయోగించే రంపంతో గొంతు కోసుకున్నాడు. లలిత్ పూర్ లో ఇది చోటు చేసుకుంది. బాధిత యువకుడిని ఝాన్సీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు.

రఘునాథపురానికి చెందిన దీపక్ కుశ్వహగా బాధితుడిని గుర్తించారు. కొంతవరకు గొంతు కోసుకున్న తర్వాత ఆ బాధ తాళలేక కేకలు పెట్టడంతో సమీపంలోని వారు విని పరుగెత్తుకు వచ్చి చూశారు. పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు ఝాన్సీ హాస్పిటల్ కు తీసుకెళ్లాలని సూచించారు. దీపక్ కు పరమశివుడు అంటే పరమ భక్తి అని పోలీసులు వెల్లడించారు. అతడి నోట్ బుక్ లో శివుడి గురించి ఎన్నో రాతలు ఉన్నట్టు తెలుసుకున్నారు. తన తలను శివుడికి సమర్పిస్తానని కూడా అందులో రాసి ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది.

Uttar Pradesh
man
cuts neck
Lord Shiva
offered
  • Loading...

More Telugu News