Ramcharan: రామ్‌చరణ్​ రిలీజ్ చేసిన బెదురులంక ట్రైలర్​.. శివ శంకర వరప్రసాద్ పాత్రలో కార్తికేయ

Ramcharan releases Bedurulanka 2012 Official Trailer

  • కార్తికేయ, నేహాశెట్టి జంటగా వస్తున్న సినిమా
  • కామెడీ, రొమాన్స్, యాక్షన్ తో ఆసక్తిపెంచిన ట్రైలర్
  • ఈ నెల 25న విడుదల కానున్న చిత్రం

ఆర్ఎక్స్100తో టాలీవుడ్‌ కు పరిచయమైన కార్తికేయ, డీజే టిల్లుతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’.  క్లాక్స్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిన్న విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి అసలు పేరైన శివ శంకర వరప్రసాద్ అనే పాత్రలో కార్తికేయ నటించాడు.  కామెడీ, రొమాన్స్ తో పాటు, యాక్షన్, డ్రామా  ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. డిసెంబర్ 21, 2012న ప్రపంచమంతా యుగాంతం వస్తుందంటూ ‘బెదురులంక’ అనే గ్రామంలో చర్చతో ట్రైలర్ ప్రారంభైంది. 

యుగాంతం పుకార్ల నేపథ్యంలో కొందరు మోసగాళ్లు ప్రజల అమాయకత్వాన్ని, భక్తిని ఆసరాగా చేసుకుని దేవుడి పేరుతో దోపిడీ చేస్తుంటారు. వాళ్ళ మాటలు నమ్మని హీరో ఏం చేశాడు? అన్నది మిగతా కథ అని తెలుస్తోంది. చిత్రంలో హీరోని ప్రేమించే అమ్మాయిగా హీరోయిన్ నేహా శెట్టి కనిపించింది. అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, 'వెన్నెల' కిశోర్, సత్య, రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

Ramcharan
kartikeya
neha shetty
Bedurulanka 2012 Trailer

More Telugu News