gold price: పెళ్లిళ్ల సీజన్ వేళ భారీగా తగ్గిన బంగారం ధర

Gold prices decreased today

  • తులం బంగారంపై రూ.380 తగ్గింపు
  • 24 క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర రూ.59,020
  • రూ.500 మేర తగ్గిన కిలో వెండి ధర

శ్రావణ మాసం రావడంతో తెలుగు రాష్ట్రాల్లో శుభకార్యాల హడావుడి పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో షాపింగ్ మాల్స్, బంగారం దుకాణాలలో సందడి నెలకొంది. ఈ నేపథ్యంలోనే గురువారం బంగారం ధర భారీగా తగ్గింది. సాధారణంగా తులం బంగారంపై రూ.100 నుంచి రూ.150 వరకు తగ్గుతుందని, గురువారం మాత్రం ఏకంగా రూ.380 తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. తగ్గిన ధర ప్రకారం హైదరాబాద్ గోల్డ్ మార్కెట్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.350 మేర తగ్గి రూ.54,100కి చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.380 మేర తగ్గి రూ.59,020కి చేరింది.

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖపట్నంలతో పాటు కేరళ, బెంగళూరు, కోల్‌కతా, ముంబైలలో కూడా హైదరాబాద్ లోని ధరలే కొనసాగుతున్నాయి. తమిళనాడులోని చెన్నైలో మాత్రం 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.54,560 కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.59,520 లుగా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.54,250, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.59,170 లుగా ఉంది. ఇక, వెండి ధరలు.. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.75,700 గా ఉండగా.. బెంగుళూరు, కోల్‌కతా, ముంబై, ఢిల్లీలో కిలో ధర రూ.72,500 లు గా ఉంది.

gold price
Hyderabad gold price
gold price reduced
silver prices
gold market
  • Loading...

More Telugu News