Kaavaalayya Song: రజనీకాంత్ ‘కావాలయ్యా’ పాటకు డ్యాన్స్ ఇరగదీసిన జపాన్ రాయబారి.. వీడియో ఇదిగో!

Kaavaalaa dance video with Japanese YouTuber Mayo san

  • ఆడియన్స్‌ను కిక్కెక్కిస్తున్న ‘జైలర్’ సాంగ్
  • యూట్యూబర్‌తో కలిసి స్టెప్పులేసిన రాయబారి
  • కామెంట్లతో హోరెత్తిస్తున్న యూజర్లు

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. రికార్డుల వర్షం కురిపిస్తోంది. 72 ఏళ్ల వయసులో ఆయన నటన, ఎనర్జీ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇందులోని ‘కావాలయ్యా’సాంగ్ దుమ్మురేపుతోంది. యూట్యూబ్‌లో అయితే రికార్డుల దుమ్ము దులుపుతోంది. ఈ పాటకు ఆడియన్స్ ఊగిపోతున్నారు. ఈ మ్యాజిక్ సాంగ్‌కు డ్యాన్సులు వేస్తూ రీల్స్ చేస్తున్నారు. 

ఇండియాలో జపాన్ రాయబారి హిరోషి సుజుకి కూడా ఈ పాటకు ఫిదా అయిపోయారు. జపనీస్ యూట్యూబర్ మాయో శాన్‌తో కలిసి ఈ పాటకు స్టెప్పులేసి ముచ్చట తీర్చుకున్నారు. ఎక్స్(గతంలో ట్విట్టర్)లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. 17 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో 24 గంటల వ్యవధిలోనే దాదాపు 7.50 లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది.

More Telugu News