payal: 'మంగళవారం' మూవీ నుంచి 'గణ గణ మోగాలిరా' సాంగ్ రిలీజ్!

Mangalavaram movie lyrical song released

  • పాయల్ ప్రధాన పాత్రగా 'మంగళవారం'
  • హారర్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ
  • గ్రామీణ నేపథ్యాన్ని ఎంచుకున్న అజయ్ భూపతి  
  • సంగీతాన్ని అందిస్తున్న అజనీశ్ లోక్ నాథ్

'RX 100' వంటి రొమాంటిక్ లవ్ స్టోరీతో యూత్ ను మెప్పించిన అజయ్ భూపతి, ఆ తరువాత 'మహా సముద్రం' వంటి ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ సినిమాను అందించాడు. ఆ రెండు కథలతో ఏ మాత్రం పొంతనలేని హారర్ థ్రిల్లర్ జోనర్ ను ఈ సారి ఆయన ఎంచుకున్నాడు. అలా ఆ జోనర్లో ఆయన రూపొందిస్తున్న సినిమానే 'మంగళవారం'. 

పాయల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా నుంచి కొంత సేపటి క్రితం 'గణ గణ మోగాలిరా' అనే ఒక లిరికల్ వీడియో సాంగును విడుదల చేశారు. ' అమ్మా హారతి అందుకో .. మమ్ము ఆదుకో, పూజలందుకో .. పుణ్యమిచ్చుకో .. '   అంటూ ఈ పాట మొదలవుతోంది. అమ్మవారి జాతర సందర్భంలో వచ్చే పాట ఇది. 

అజనీశ్ లోక్ నాథ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఆయన స్వరపరిచిన ఈ పాటకి భాస్కర భట్ల సాహిత్యాన్ని అందించగా, మహాలింగం ఆలపించాడు. జాతర నేపథ్యానికి తగిన బీట్ తోనే ఈ పాట నడుస్తుంది.  అజయ్ ఘోష్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News