Rajanikanth: కమల్ - మణిరత్నం మూవీలో రజనీ!

Rajani in Manirathnam movie

  • కమల్ తో ప్రాజెక్టును ప్లాన్ చేసిన మణిరత్నం 
  • గతంలో ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'నాయకుడు'
  • కీలకపాత్ర కోసం రజనీతో సంప్రదింపులంటూ టాక్ 
  • త్వరలోనే రానున్న క్లారిటీ    


వయసు పైబడుతున్న కారణంగా మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' తరువాత ఇక సినిమాలు చేయకపోవచ్చనే టాక్ ఆ మధ్య కోలీవుడ్ లో గట్టిగానే వినిపించింది. ఆ సినిమా షూటింగు సమయంలోనే ఆయన చాలా ఇబ్బంది పడ్డారని చెప్పుకున్నారు. అందువలన ఆయన ఇక సినిమాలకు గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉందనే ప్రచారం ఒక వైపున నడుస్తూనే ఉంది. 

ఈ నేపథ్యంలోనే ఆయన మరో మల్టీ స్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కమల్ ఈ సినిమాలో కథానాయకుడు అయినప్పటికీ, ఒక కీలకమైన పాత్రలో రజనీతో నటింపజేయాలనే ఉద్దేశంతో మణిరత్నం ఉన్నారని అంటున్నారు. అందుకు సంబంధించిన ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయని చెబుతున్నారు. కమల్ తో మణిరత్నం చేసిన 'నాయకుడు' .. రజనీతో చేసిన 'దళపతి' వారి కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచిపోయాయి. అలాంటి ఈ ఇద్దరితో కలిసి సినిమా చేయడానికి మణిరత్నం రెడీ అవుతున్నారు. నిజానికి తాము కలిసి నటించకూడదని చాలాకాలం క్రితమే రజనీ - కమల్ నిర్ణయించుకున్నారు. కానీ మణిరత్నం విషయంలో ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టే ఛాన్స్ లేకపోలేదని అంటున్నారు. 

Rajanikanth
Kamal Haasan
Manirathnam
  • Loading...

More Telugu News