MLC Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో మరో ట్విస్ట్.. ఆయన భార్య పేరును ఎందుకు చేర్చలేదన్న హైకోర్టు

High Court reserves judgement in MLC Anantha Babu case

  • డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న అనంతబాబు
  • కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల పిటిషన్
  • తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు

దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు. మరోవైపు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ మృతుడి తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు ధర్మాసనం విచారణను ముగించింది. తీర్పును రిజర్వ్ లో ఉంచింది.

ఇక ఈ రోజు విచారణలో భాగంగా, హైకోర్టు ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్న వారిని కేసులో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించింది. ఫుటేజీలో ఉన్నవారు ఎవరు, ఏం చేస్తారో పేర్కొనాలన్న సింగిల్ జడ్జి తీర్పును కూడా పట్టించుకోకుండా... వారి వివరాలను పేర్కొనకుండా ఛార్జ్ షీట్ ఎలా వేస్తారని ప్రశ్నించింది. అనంతబాబు భార్యను నిందితురాలిగా ఎందుకు చేర్చలేదని నిలదీసింది. ఈ సందర్భంగా అనంతబాబు తరపు లాయర్ వాదనలను వినేందుకు కూడా ధర్మాసనం ఒప్పుకోలేదు. సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల తరపున జడ శ్రవణ్ వాదనలు వినిపించారు.

MLC Anantha Babu
YSRCP
AP High Court
CBI
  • Loading...

More Telugu News