The Vaccine War: ‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడి నుంచి ‘ ది వ్యాక్సిన్ వార్’.. ఆసక్తి పెంచిన టీజర్

- కశ్మీర్ ఫైల్స్ చిత్రంతో పేరు తెచ్చుకున్న వివేక్ అగ్నిహోత్రి
- సెప్టెంబర్ 28న విడుదల కానున్న వ్యాక్సిన్ వార్ చిత్రం
- కీలక పాత్రల్లో నానా పటేకర్, అనుపమ్ ఖేర్, సప్తమి గౌడ
‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో దేశం మొత్తం సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. సెప్టెంబర్ 28న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
