TDP: చిరుతను తరమడానికి బ్రహ్మాండమైన రూళ్ల కర్ర ఇస్తారట..: బోండా ఉమ

Bonda Uma Maheshwar Rao Press meet

  • అదే కర్రతో వీళ్లకు బడిత పూజ చేస్తే అంతా సర్దుకుంటుందన్న ఉమ
  • క్రూరమృగాలు తిరుమల కొండపైకి రావడానికి కారణం వైసీపీ నేతలేనని విమర్శ   
  • వైసీపీ దొంగలు అడవులను కొట్టేయడం వల్లే జంతువులు కొండపైకి వస్తున్నాయని ఆరోపణ

కాలినడక భక్తులకు కర్ర ఇవ్వాలని నిర్ణయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. అలిపిరి మెట్ల మార్గంలో చిన్నారిపై చిరుత దాడి ఘటన తర్వాత టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిపై తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమ మండిపడ్డారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అటవీ మృగాల నుంచి రక్షణ కల్పించలేక చేతులెత్తేశారని టీటీడీ చైర్మన్ పై విమర్శలు గుప్పించారు.

చిరుతను కొట్టడానికి టీటీడీ చైర్మన్ బ్రహ్మాండమైన రూళ్లకర్ర ఇస్తాడట.. భక్తులు ఆ రూళ్లకర్రను తీసుకుని వీళ్లకు బడిత పూజ చేస్తే అటవీ మృగాలు ఏవీ కూడా కొండపైకి రావని బోండా ఉమ చెప్పారు. అడవుల్లో ఉండాల్సిన క్రూరమృగాలు తిరుమల కొండపైకి రావడానికి కారణం వైసీపీ నేతలేనని ఆరోపించారు. వైసీపీ దొంగలంతా చేరి ఎర్ర చందనం సహా విలువైన కలపను ఇష్టారాజ్యంగా నరికివేస్తున్నారని విమర్శించారు. దీంతో రక్షణ లేక క్రూరమృగాలు అలిపిరి వైపు వచ్చి జనాలపై దాడులు చేస్తున్నాయని బోండా ఉమ చెప్పారు.

More Telugu News