Daggubati Purandeswari: అణు పరీక్షలను నిర్వహించిన ధీరోదాత్తుడు ఆయన: వాజ్ పేయికి పురందేశ్వరి నివాళులు

Purandeswari praises Vajpayee

  • విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో వాజ్ పేయి వర్ధంతి కార్యక్రమం
  • చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన పురందేశ్వరి
  • వాజ్ పేయి చూపిన మార్గంలో నడుస్తామని వ్యాఖ్య

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి కార్యక్రమాన్ని విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వాజ్ పేయి చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ సేవకు వాజ్ పేయి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. బీజేపీని అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనదేనని చెప్పారు. సుపరిపాలన అంటేనే వాజ్ పేయి గుర్తొస్తారని అన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలను నిర్వహించిన ధైర్యవంతుడని చెప్పారు. చిన్న వయసులోనే సామాజిక కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. అటల్ స్ఫూర్తితో యువత పని చేయాలని చెప్పారు. వాజ్ పేయి చూపిన మార్గంలో నడుస్తామని తెలిపారు.

Daggubati Purandeswari
BJP
Vajpayee
  • Loading...

More Telugu News