Divyansha Kaushik: విజయ్ దేవరకొండ జోడీగా ఛాన్స్ కొట్టేసిన దివ్యాన్ష కౌశిక్!

Divyansha in Vijay Devarakonda Movie

  • 'మజిలీ'తో ఎంట్రీ ఇచ్చిన దివ్యాన్ష కౌశిక్
  • గ్లామరస్ హీరోయిన్ గా యూత్ లో క్రేజ్ 
  • పరశురామ్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్
  • ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతున్న షూటింగ్  
  • త్వరలో అమెరికా వెళుతున్న టీమ్     


దివ్యాన్ష కౌశిక్ అనే పేరు వినగానే తెలుగు ఆడియన్స్ కి 'మజిలీ' సినిమా గుర్తుకు వస్తుంది. తెలుగులో ఆమె మొదటి సినిమా ఇదే. ఫస్టు మూవీతోనే ఈ బ్యూటీ గ్లామర్ పరంగా ఇక్కడ మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఆ సినిమాకి సంబంధించిన క్రెడిట్ సమంత ఖాతాలో పడటం వలన, దివ్యాన్షకి మరో ఛాన్స్ రావడానికి కొంత సమయం పట్టింది. 

రవితేజ సరసన నాయికగా 'రామారావు ఆన్ డ్యూటీ' .. సందీప్ కిషన్ జోడీగా 'మైఖేల్' సినిమాలు చేసింది. అయితే ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం వలన, అవి ఆమె కెరియర్ కి పెద్దగా హెల్ప్ కాలేకపోయాయి. సిద్ధార్థ్ తో చేసిన 'టక్కర్' ఫ్లాప్ అయినప్పటికీ, గ్లామర్ పరంగా ఆమెకి దక్కవలసిన క్రెడిట్ దక్కింది. అందువల్లనే ఆమె ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, ఒక కథానాయికగా మృణాల్ ఠాకూర్ ను తీసుకున్నారు. రెండో కథానాయికగా దివ్యాన్షను ఎంచుకున్నారు. ఈ సినిమాకి 'ఫ్యామిలీ స్టార్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో షూటింగు జరుపుకుంటున్న ఈ సినిమా, ఆ తరువాత షెడ్యూల్ కోసం అమెరికా వెళ్లనుంది. 

Divyansha Kaushik
Vijay Devarakonda
Mrunal Thakur
Parashuram
  • Loading...

More Telugu News