Chandrababu: విశాఖలో ఎన్టీఆర్ విగ్రహం నుంచి అల్లూరి విగ్రహం వరకు చంద్రబాబు సద్భావన యాత్ర

Chandrababu attends Sadbhavana Yatra in Vizag

  • విశాఖలో చంద్రబాబు పాదయాత్ర
  • ఆర్కే బీచ్ లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి
  • ఎంజీఎం గ్రౌండ్ లో సభ
  • 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ సాయంత్రం విశాఖ నగరం బీచ్ రోడ్డులో సమైక్య పాదయాత్ర నిర్వహించనున్నారు. ఇప్పటికే నగరానికి చేరుకున్న చంద్రబాబు తొలుత ఆర్కే బీచ్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం, ఎన్టీఆర్ విగ్రహం నుంచి అల్లూరి విగ్రహం వరకు 2.5 కిలోమీటర్ల మేర సద్భావన యాత్ర చేపట్టారు. చంద్రబాబు త్రివర్ణ పతాకం చేతబూని యాత్రలో పాల్గొన్నారు. 

పాదయాత్ర అనంతరం చంద్రబాబు ఎంజీఎం గ్రౌండ్ లో బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు. వివిధ వర్గాల మేధావులతో చర్చ కార్యక్రమం జరపనున్నారు.

చంద్రబాబు రాక నేపథ్యంలో, జాతీయ జెండాల రెపరెపలతో విశాఖ బీచ్ లో భారీ కోలాహలం నెలకొంది. ప్రముఖులు, నగరవాసులు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు.

More Telugu News